గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవి
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (12:16 IST)

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

Vishwambhara ramarasong
Vishwambhara ramarasong
సినిమా ప్రారంభంలోనే కథలు ఎక్కువగా పౌరాణికాలు, ఇతిహాసాలు, జానపదాలు  వుండేవి. ప్రతికథలోనూ రామాయణ, మహాభారతాలను బేస్‌ చేసుకుని  సినిమాలు తీస్తుండేవారు. రాను రాను సాంఘికాల పేరుతో పలు రకాల కథలు వచ్చాయి. కొన్ని  వాస్తవఘటనలు అయితే ఎక్కువగా  కల్పితాలుగా వుండేవి. ఇప్పుడు సాంఘికాలలో కథలు రాయడం చాలా కష్టమైపోయింది. అందుకే కథలు వెనక్కు వెళుతున్నాయి. చారిత్రక కథలు నేపథ్యాలుగా రాజులను హీరోలుగా చూపిస్తూ సినిమాలు వస్తున్నాయి. రాజ మౌళి ఇందుకు మార్గం చూపించారని అనుకోవచ్చు. 
 
తాజాగా బాలీవుడ్‌ సినిమా ఛావా కూడా అంటువంటిదే. శివాజీ వారసుడి కథను తీసుకుని  గతంలోంచి వెలికితీసిన కథను సినిమాగాతీశారు. ఇక రామాయణ కథలను ఆమధ్య ప్రభాస్‌ తో ఆదిపురుష్‌ చిత్రంగా చేశారు. ఇలా చాలా సినిమాలకు కథలు పౌరాణికాలే. తెలుగు అయితే ఆ  మధ్య తేజ సజ్జాతో హనుమాన్‌ సినిమాను తీశారు. కృష్ణతత్త్వాన్ని కార్తికేయ రెండు భాగాలుతో చూపించారు. మరికొన్ని  సినిమాలు రన్లోనింగ్ లో  వున్నాయి. పైకి మాత్రం కథలు సామాజిక అంశాలు, సాంఘికాలుగా కనిపిస్తున్నా అంతర్లీనంగా హిందూయిజం, భక్తితత్త్వంతో కూడినవిధంగా ఏదో సన్శంనివేశంలో కనిపించేలా చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు  కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినట్లుగా ఫిలింనగర్‌ లో కథనాలు వినిపిస్తున్నాయి. 
 
తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరలోనూ ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అందులో ఓ సన్నీవేశంలో రాముడు, లక్మణుడు, హనుమంతుల వారు వున్న ఆద్యాత్మిక వాతారణంలో కూడిన పాట సాగుతోందట. ఎ.ఎస్‌. ప్రకాశ్‌ వేసిన ప్రత్యేకమైన సెట్లో రాముడు, లక్మణుడు, హనుమంతుల వారు ఉండేవిధంగా చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి దీనిపై తగు కేర్‌ తీసుకున్నారని తెలిసింది. సోమవారంనాడు చిరంజీవిలో పాటలో పాల్గొనబోతున్నారు. కోకాపేటలో దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణసాగుతోంది. తెలుగులో అద్భుతమైన డాన్స్‌ మాస్టర్లు వున్నా శోభి మాస్టర్‌ నే ఎంచుకోవడం కూడా విశేషంగా చెప్పవచ్చని  తెలుస్తోంది.
 
సోషియో ఫాంటసీగా విశ్వంభర ఇప్పటికే షూటింగ్‌ పూర్తయి రిలీజ్‌ కు సిద్ధంగా వుంది. అయితే సాంకేతికంగా గ్రాఫిక్స్‌ పనులు ఆలస్యంకావడంతో సినిమా వాయిదా వేసినట్లు నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్‌ గతంలో పేర్కొంది. కాగా, రామజోగయ్య రాసిన రామ రామ జయరామ.. అనే పాటను ప్రత్యేకంగా ఇమిడ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు  అంచనా వేస్తున్నాయి.