సోమవారం, 29 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Last Updated : శనివారం, 27 సెప్టెంబరు 2025 (11:45 IST)

Chiru: బాలయ్య పై చిరంజీవి వెంటనే రియాక్ట్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ కారణమా..

Balakrishna - Chiranjeevi (File)
Balakrishna - Chiranjeevi (File)
గత రెండురోజులుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినిమా పెద్దలను గతంలో వై.ఎస్. జగన్ పిలిచి అవమానించాడంటూ బిజెపి నాయకుడు కామినేని చేసిన వ్యాఖ్యలకు శాసనసభ్యుడు హోదాలో నందమూరి బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యాలు పెద్ద రాద్దాంతంగా మారాయి. పలువురు పలురకాలుగా విశ్లేషణలు చేయడం విశేషమం. అయితే చిరంజీవి విదేశాల్లో వున్నా టీవీలో చూసి నేను స్పందించానంటూ సోషల్ మీడియాలో వెంటనే రియాక్ట్ కావడం కూడా ఆశ్చర్యంగా వుంది. షూటింగ్ లో వున్న ఆయనకు అసెంబ్లీ గురించి పట్టించుకోనే టైం కూడా వుండదు. కానీ దీని వెనుక పవన్ కళ్యాణ్ సూచన మేరకు జరిగిందనేది సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
 
ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వంపై రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. దానిని నారా చంద్రబాబు నాయుడు చాలా నొక్కి పెట్టి వస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రావడం కొంచెం ఇబ్బందికరంగా వుంటుందని తెలుస్తోంది. ఏదిఏమైనా.. చిరంజీవి బాలక్రిష్ణ ఇద్దరూ స్వయం క్రిషితో ఎదిగారు. కానీ బాలయ్యది వడ్డించిన విస్తరి. చిరంజీవిది కష్టపడి పైకి ఎదిగాడు.
 
సినీ పెద్దలు చెబుతున్నట్లు... చిరంజీవి, బాలకృష్ణ.. ఇద్దరూ జనం సొమ్ముతో ఎదిగలేదు. జనానికి వినోదాన్ని పంచి ఎదిగారు. వారిద్దరి వల్ల సమాజానికి మేలే జరిగింది తప్ప కీడు జరగలా.. ఇద్దరూ రాజకీయాలు చేశారు.. బాలయ్య చేస్తున్నాడు కూడా.. కానీ ఇద్దరిపై ఒక్క అవినీతి మరక లేదు. కానీ దశాబ్దాలుగా ఇద్దరికీ వృత్తి పరంగా పోటీ ఉంది..ఈ కారణంగా ఎవరి ఇగోలు వాళ్లకుంటాయ్.
 
ఒకరు లౌక్యం తెలిసిన మనిషి.. ఒకరు లౌక్యం లేని మనిషి..ఒకరు ఆచి తూచి మాట్లాడతాడు.. ఒకరు నోటికొచ్చింది మాట్లాడతాడు..
"చిరంజీవిగారూ మనం కలిసి సినిమా చేద్దాం' అని మీడియా సాక్షిగా అన్న పసితనం బాలయ్యదైతే..  "బాలా తో కలిసి మల్టీ స్టారర్ చేయాలనుంది" అని సభ సాక్షిగా అన్న మంచితనం చిరంజీవిది.. 
 
అయితే అసెంబ్లీ సభలో చిరంజీవిగారిని బాలయ్య ఎక్కడా అగౌరవంగా మాట్లాడలేదు.. కాకపోతే.. వ్యంగ్యాన్ని ప్రదర్శిస్తూ సభలో చేసిన ఆయన ఆంగికాభినయం మాత్రం చూడ్డానికి ఇబ్బందిగా అనిపించింది.. అది ఆయన అర్ధం చేసుకునేలోపు అనర్థం జరిగిపోయింది..
చిరంజీవిగారు కూడా అంత వేగంగా స్పందించి వుండాల్సింది కాదు.. ఆయన్ను జగన్ అవమానం చేశాడో లేదో జనమంతా చూశారు.. 
ఈ విషయంలో కళ్యాణ్ గారు కూడా స్పందించారు.. కానీ ఆయన లెటర్లో జగన్ నన్ను 'గౌరవించాడు' అనడం భావ్యంగా అనిపించలేదు..
ఏదేమైనా.. సభలో బాలయ్య హావభావాలు.. లెటర్లో చిరంజీవిగారి భావాలు రెండూ సమర్థనీయం కావు..
 
అసలు ఈ గందరగోళానికి కారకులు మంత్రి కామినేని శ్రీనివాసరావు.. ఆయన ఫిక్షన్ జోడించి మాట్లాడుండక పోతే బాలయ్య స్పందించేవారు కాదు.. దీనికి తోడు fDC కమిటీని ఎంపిక చేసే ప్యానల్ లో 9వ పేరుగా బాలయ్య పేరును చేర్చి ఆయన కోపానికి కారకుడయ్యారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.  సినిమాకు సంభందించిన ఓ కీలక కమిటీని ఎన్నుకునే ప్యానల్ లో బాలకృష్ణ లాంటి మూవీ లెజండ్ ని 9వ పేరుగా ఎలా రాస్తారు? ఇవన్నీ సభలో పని చేశాయి.. ఇన్ని ఉపద్రవాలకు దారితీశాయ్.. ఇది అవతలి వారికి వజ్రాయుధంగా మారింది.. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు.. ఇలాంటివి కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపుతాయా? లేదా? అనేది తెలియాల్సింది. జగన్ సైకో అనేది అందరికీ తెలిసిందే. ఆ పేరు విషయంలో జగన్ కూటమి ఇప్పటికే బాలయ్య పై ఎదురు దాడి చేశారు. వై.ఎస్. బతికి వున్నప్పుడు బాలయ్య ఇంట్లో కాల్పులు జరిగాక ఫ్యామిలీ అంతా వై.ఎస్.కాళ్ళపై పడి.. వీడికి కొంచెం పిచ్చ వుందని అన్నారని.. తెలియజేస్తున్నారు.
 
ఏది ఏమైనా గతంలో జనాలకు సినిమా రంగంలో కాపు, కమ్మ వర్గానికి చెందిన వ్యక్తుల మధ్య వార్ వుందని తెలిసిందే. అది ఇప్పుడు మరింత జటిలంగా అనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదేమైనా రాజకీయ ఎత్తుగడ అనేది తెలియాల్సి వుంది. కామినేనిని పావుగా వుపయోగించుకుంటున్నారా? అసలు అసెంబ్లీలో సినిరంగం గురించి ఎప్పుడో అయిపోయిన దానిని మరలా ఎందుకు తెచ్చారు.
 
గతంలో ఇదే కామినేని పవన్ ను చిరంజీవిని ఓ సందర్భంలో విమర్శించారు. కానీ అప్పుడు చిరంజీవి వెంటనే స్పందించలేదు. కానీ తాజా విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతిలో వుంది. దానికి  ఆయన ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.