శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (21:09 IST)

మేఘ్నా వినోద్ ఎవరు..? సమంత- చైతూ విడాకులకు కారణం ఆమేనా?

Nagachaitanya, Samantha
సమంత రూత్ ప్రభు విడాకుల తర్వాత ఎప్పుడూ లేనంతగా వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో సమంత ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య గురించి అనేక వార్తలు వచ్చాయి. అయితే వీలైనప్పుడల్లా సమంత వాటన్నింటికీ సమాధానం చెబుతూనే ఉంది. ప్రేమలో ఉన్న ఈ జంట కొన్నాళ్లకే పెళ్లయిన తర్వాత విడిపోయారు. రెండో పెళ్లిళ్లు, అఫైర్స్ గురించి వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. 
 
ఇప్పుడు సమంత, నాగచైతన్యల విడాకుల గురించి మరో వార్త హల్‌చల్ చేస్తోంది. దానికి కారణం సమంత చేసిన పోస్ట్. ఇటీవల సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరోగ్యం గురించి పోడ్‌కాస్ట్ గురించి ఒక ఫోటోను షేర్ చేసింది. మలేషియాలో మేఘన అనే స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటోను సమంత షేర్ చేసింది. నా అమూల్యమైన నిర్ణయాలకు ముఖం ఏదైనా ఉందంటే అది మేఘన అని సమంత వ్యాఖ్యానించింది.
 
ఈ పోస్ట్ తర్వాత మేఘనా వినోద్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మేఘనా వినోద్ ఎవరు? సమంత-నాగ చైతన్యల విడాకులకు ఆమె కారణమా? దీనిపైనే చర్చ జరుగుతోంది.