శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (10:04 IST)

మళ్లీ తెరపై కనిపించబోతున్న ప్రభాస్-అనుష్క జంట.. ఫ్యాన్స్ ఖుషీ

prabhas anushka
బాహుబలి జంట ప్రభాస్, అనుష్క మళ్లీ తెరపైకి రానుంది. వీరిద్దరూ రియల్ లైఫులో కూడా ఒక్కటవ్వాలని కలలు కంటున్న ఫ్యాన్సుకు ఈ వార్త పండగ చేసుకునే లాంటిదే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాము స్నేహితులమేనని.. ప్రేమా లేదు దోమా లేదంటూ అనుష్క- ప్రభాస్ తేల్చేశారు. దీంతో నిరాశకు గురైన ఫ్యాన్సుకు మళ్లీ ప్రభాస్-అనుష్క తెరపై కనిపించడం కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. 'బాహుబలి' చిత్రాల నిర్మాత ప్రభాస్, అనుష్కలతో ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నారని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రానికి ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ... వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.