శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (16:48 IST)

హైదరాబాదులో మూడో ఆస్తి.. ఇల్లు కొనుగోలు చేసిన రాశిఖన్నా

టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా హైదరాబాదులో ఇల్లు కొనుగోలు చేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన బాలీవుడ్ చిత్రం 'యోధా'లో కనిపించిన ఆమె హైదరాబాద్‌లో కొత్త పెట్టుబడితో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె ఇక్కడ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు, టాలీవుడ్ రాజధానిలో ఆమె మూడవది కావడం విశేషం. 
 
రాశి ఇటీవల తన మూడవ ఆస్తిని సంపాదించింది. టాలీవుడ్‌లో కాకుండా తమిళం, హిందీ సినిమాలలో కనిపిస్తోన్న రాశిఖన్నా.. "తెలుసు కదా" అనే చిత్రంలో నటిస్తోంది. హైదరాబాదులో గతంలో 2015, 2017లో ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. వరుసగా లగ్జరీ అపార్ట్‌మెంట్, డ్యూప్లెక్స్ విల్లాలు కొనుగోలు చేసింది.