శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 నవంబరు 2024 (15:01 IST)

పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!

Sreeleela
Sreeleela
పుష్ప-2 ఐటంగర్ల్‌ కోసం రచ్చ రచ్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా శ్రద్ధా కపూర్ పుష్ప-లో ఐటం సాంగ్ చేస్తుందని ప్రచారం సాగింది. కానీ శ్రద్ధ హై రెమ్యూనిరేషన్ డిమాండ్ చేయటంతో పాటు డేట్స్ సర్దుబాటు కాలేని పరిస్దితి‌‌ ఏర్పడిందని టాక్.

ఇకపోతే.. నవంబర్ 4 నుంచి పుష్ప 2 ఐటం సాంగ్ చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో పుష్ప 2 మేకర్స్ శ్రీలీలను మరో ఆప్షన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల మంచి డాన్సర్.. బన్నీతో కలిసి ఆమె డాన్స్ వెస్తే థియేటర్ దద్దరిల్లటం ఖాయం.
 
అందుకే పుష్ప 2 ఐటం గర్ల్‌గా శ్రీలీల బెటర్ ఆప్షన్ అని భావిస్తున్నారని సమాచారం. పుష్ప తొలిపార్ట్‌లో సమంత ఐటైం సాంగ్ చేయటం సినిమాకు ప్లస్ అవటమే కాకుండా, బాలీవుడ్‌లో కూడా క్రేజ్ వచ్చింది.