Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద
సింగర్ చిన్మయిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ రీసెంట్‌గా తాళిపై చేసిన కామెంట్స్ వ్యవహారంలో ఈ దంపతులపై ట్రోలింగ్ సాగగా... ఆమె రియాక్ట్ అయ్యారు. తనపై వేధింపుల కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీపీ సజ్జనార్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై వి.సి. సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్, హైదరాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ట్యాగ్ చేసి చర్య తీసుకోవాలని కోరారు.
రీసెంట్‌గా నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రలో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని తెరకెక్కించారు. ఈ నెల 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తాళిపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తన భార్య తాళి మెడలో వేసుకోవాలా వద్దా అనేది ఆమె ఇష్టమేనని చేసిన కామెంట్లు విభిన్న కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా... కొందరు నెటిజన్లు సపోర్ట్ చేయగా, మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. రాహుల్, చిన్మయి కపుల్‌ను ఏకి పారేశారు. దీనిపై రియాక్ట్ అయిన చిన్మయి ఘాటుగానే బదులిచ్చింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్, కామెంట్స్ విపరీతంగా సాగడంతో ఈ వ్యవహారాన్ని సింగర్ చిన్మయి సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.
"దయచేసి దీన్ని చూడండి సార్. నేను ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. తెలంగాణలో మహిళలు మెరుగైన అర్హత కలిగి ఉన్నారు. వారికి ఏదైనా అభిప్రాయం నచ్చకపోతే వదిలేసి వెళ్లిపోవచ్చు. ఈ పురుషులు ప్రాథమికంగా నా పిల్లలు చనిపోవాలని చెబుతున్నారు. నేను కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ కేసు 15 ఏళ్లు పట్టినా చట్టం తన పని తాను చేసుకోనివ్వండి." అంటూ రాసుకొచ్చారు.