శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (14:05 IST)

పుష్ప 2 ఐటెం సాంగ్ కు రెడీ - ఊర్వశి రౌతుల్లా, పూజా హెగ్డే లో ఎవరికి దక్కుతుందో?

Urvashi Rautulla  Pooja Hegde
Urvashi Rautulla Pooja Hegde
ఇటీవలే వలే దర్శకుడు  సుకుమార్ పుష్ప 2 ది రూల్ టీజర్‌లో అల్లు అర్జున్ ఆండ్రోజినస్ జాతర రూపాన్ని చూపించాడు. శ్రీవల్లిని 2.0 చూస్తారు అని  రష్మిక మండదన్నా కూడా తెలియజేసింది. కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేయడానికి సన్నద్ధం చేశారు. ఇందుకు గండిపేటలోని ప్రగతి రిసార్ట్స్ వేదిక అయింది. ఈరోజు అక్కడ గెస్ట్ లను అనుమించకుండా మొత్తం షూటింగ్ కు కేటాయించినట్లు సమాచారం. ఈ రోజు రాత్రి అక్కడ సాంగ్ షూట్ జరనున్నదని సమాచారం.
 
ఆ రిసార్ట్స్ లోనే పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేయనున్నారని తెలిసింది. ఈ సాంగ్ కు ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఊర్వశి రౌతుల్లా, పూజా హెగ్డే పేర్లు ఖరారు చేశారు. అయితే ఇందులో ఒక్కరే నటించనున్నారు. మొదటి పార్ట్ లో సమంత చేసిన సాంగ్ కు మించి ఈ సాంగ్ వుంటుందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే అల్లు అర్జున్, పూజ కాంబినేషన్ లో అలవైకుంఠపురంలో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మరి ఇందులో ఆమె ఐటెం సాంగ్ చేస్తుందా? లేదా? అనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఊర్వశి బాలీవుడ్ లో ఫేమస్. పూజ సాంగ్ లో నటిస్తే మరింత మైలేజ్ వస్తుందని కొందరు చెబుతుండా, ఇప్పటికే పెద్దగా అవకాశాలు లేక ఐటెం సాంగ్ చేస్తే దానికే పరిమితం అవుతుందా? అనేది మరో చర్చ సాగుతుంది. ఇప్పటికే సమంత కు ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు లేవు. తను సినిమాలకూ దూరంగా వుంటుందని ఆరోగ్యం రీత్యా తెలియజేసింది.