శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2024 (10:53 IST)

కొత్త ఏడాది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో షురూ కానుందా !

Pawan Kalyan
Pawan Kalyan
సినిమారంగంలో కొత్త ఏడాదికి ప్రత్యేకం అనిచెప్పాలి. ఈఏడాదైన మంచి ఫలితాలు రావాలని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తుంటారు. కొత్త సినిమాలు విడుదలకూడా అగ్ర హీరోలవికావు. చిన్న సినిమాలు జనవరి 1న విడుదలవుతుంటాయి. ఎలాగూ సంక్రాంతికి పెద్ద హీరోలు వస్తారు కనుక వారి ప్రమోషన్ ను మొదలు పెడతారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తన హరిహర వీరమల్లు చిత్రం ప్రమోషన్ ను మొదలు పెట్టనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. తాజా సమాచారం మేరకు పవన్ పాడే పాటను జనవరి 1న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
 
నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న “హరిహర వీరమల్లు” ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక షూటింగ్ గేప్ రావడంతో విజయవాడ పరిసరాల్లోనే సెట్ వేసి పవన్ చేత షూటింగ్ చేయించారు. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిత్రం సాంగ్ తో కొత్త ఏడాదికి ఆహ్వానం పలికినట్లవుతుంది. చిత్ర నిర్మాతలు రాత్రి 12 గంటలకి రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. త్వరలో అప్ డేట్ ఇవ్వనున్నారు.