Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలి చిత్రం చిరుతలోని ఓసోసి రాకాసి పాటకు ఓ మహిళ చేసిన డ్యాన్స్ తాలూకూ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఓ పెళ్లి వేడుకలో ఆమె వేసిన స్టెప్పులు, చూపించిన ఎనర్జీ, గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మెగా అభిమానులు కూడా ఆమె పర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓసోసి రాకాసికి స్టెప్పులేసిన సదరు మహిళ చెర్రీ తాజా స్టెప్పులను ఇరగ దీసింది.
తాజాగా చికిరి చికిరి పాటకు చెర్రీ వేసిన స్టెప్పును ఇట్టే కాపీ కొట్టి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇకపోతే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం పెద్ది కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ రానుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఊరమాస్ లుక్స్‌తో బాక్సాఫీస్ దుమ్ముదులిపేందుకు రెడీ అవుతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా చికిరి చికిరి అనే పాటను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ చికిరి చికిరి ఫుల్ సాంగ్‌ను నవంబర్ 7న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీంతో ఈ పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా.. ఈ పాటలో చరణ్ ఎలాంటి స్టెప్స్‌తో ఇరగదీస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.