శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (16:55 IST)

మధ్య తరగతి తల్లి మనసుకు అద్దం పట్టే చిత్రం

muthyala subbaya on set
muthyala subbaya on set
ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రం "తల్లి మనసు". రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు . 
పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి.శ్రీనివాస్  (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
హైదరాబాద్, బి.హెచ్.ఈ.ఎల్. లో హీరోయిన్ ఇంటికి సంబంధించిన  సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇందులో భాగంగా రచిత మహాలక్ష్మి, సాత్విక్, సాహిత్య, దేవీప్రసాద్, శుభలేఖ సుధాకర్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. 
 
ఈ విషయాలను నిర్మాత ముత్యాల అనంత కిషోర్ తెలియజేస్తూ,  దీంతో  30 శాతం షూటింగ్ పూర్తయిందని, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తామని చెప్పారు.  షూటింగ్ తో పాటు మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయని ఆయన వివరించారు. 
 
 చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, వాస్తవిక కుటుంబ అంశాలకు దగ్గరగా తల్లి మనసుకు అద్దం పట్టే చిత్రమిదని అన్నారు. 
దర్శకుడు వి.శ్రీనివాస్  (సిప్పీ) మాట్లాడుతూ, ``ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఆమె మనోవేదన, సంఘర్షణను ఇందులో ఆవిష్కరిస్తున్నాం" అని చెప్పారు. 
 
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో , రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, జబర్దస్త్ ఫణి తదితరులు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కదా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: ముత్యాల సుబ్బయ్య, నిర్మాత: ముత్యాల అనంత కిషోర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్  (సిప్పీ) .