బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 30 ఏప్రియల్ 2025 (14:22 IST)

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

director Bhanu,  Kanakadurga Rao
director Bhanu, Kanakadurga Rao
భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో ఒక చిత్రం రాబోతోంది. యువతను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చిత్రం. వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా రూపొందుతోంది.
 
ఇప్పటివరకు సందేశం, సామాజిక స్పృహతో సినిమాలు చేసిన దర్శకుడు భాను మొట్టమొదటి సారిగా తన పంథాను మార్చుకొని ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను డైరెక్ట్ చేశారు. నలభై తొమ్మిది రోజులు నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువతను విపరీతంగా ఆకట్టుకునే ఐదు అద్భుతమైన సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. 
 
ఒక పెద్ద సంగీత కుటుంభం నుండి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు, అలాగే ఒక కొత్త టాలెంటెడ్ రైటర్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.
 
డెబ్భై ఐదు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ గా చేసిన ఒక అబ్బాయి, పదహారణాల తెలుగు అమ్మాయి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి నిర్వాహణ మర్రి రవికుమార్. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను యూనిట్ సభ్యులు విడుదల చేయబోతున్నారు.