Bhagyashree Borse: యాక్షన్ రొమాన్స్ అన్ని జోన్స్ ఇష్టమే : భాగ్యశ్రీ బోర్సే
నేను ఫస్ట్ కాంత కథనే విన్నాను. అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా కాస్త ఆలస్యంగా మొదలైంది. ఆ గ్యాప్ లో వేరే రెండు సినిమాలు చేయడం జరిగింది. టెక్నికల్ గా నేను ఫస్ట్ సైన్స్ చేసిన కథ కాంతనే అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అన్నారు.
దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
-కాంత నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఫుల్ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. దుల్కర్ గారు రానా గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది మరింత ఆనందాన్ని ఇచ్చింది.
- న్యూ కమ్మర్ కి ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టం. ఒక ఛాలెంజ్ గా ఈ క్యారెక్టర్ ని తీసుకున్నాను. కుమారి క్యారెక్టర్ కి ఏం కావాలో గ్రౌండ్ వర్క్ చేశాను. 1960 టైమ్స్ ని రీ క్రియేట్ చేయాలి. అది చాలా టఫ్ జాబ్. ఈ సినిమా కోసం పాత తెలుగు తమిళ్ సినిమాలు చూశాను. శ్రీదేవి గారు సావిత్రి గారి నటన గమనించాను. వాటన్నిటినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని కుమారిని కొత్తగా రీక్రియేట్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. కుమారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది.
-షూటింగ్ అంతా చాలా పాజిటివ్ గా జరిగింది. అందరం ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. ఇది నేను 2023లో విన్న కథ అప్పటి నుంచి మాకు జర్నీ ఉంది. చాలా మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్యూర్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. ఒక న్యూ కమ్మర్ కి ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు.
- కాంత, ఆంధ్ర కింగ్ వరుసగా వస్తున్నాయి. చాలా ఎక్సయిట్ గా వుంది.. అదే టైంలో నెర్వస్ గా కూడా ఉంది. నా వరకు 100% ఇచ్చాను . తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుందని నమ్ముతున్నాను
- నాకు ఇష్టమైన జానర్ లు.. యాక్షన్ రొమాన్స్ అన్ని జోన్స్ ఇష్టమే. అన్ని రకాల పాత్రలు చేయాలనే ఉంటుంది.
- ఒక ఆర్టిస్ట్ కి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. మంచి స్క్రిప్ట్స్ ఉంటే చేస్తాను. అయితే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు సినిమాకే.
-కాంతలో సినిమాలో సినిమా ఉంటుంది. ఆంధ్ర కింగ్ ఒక ఫ్యాన్ బయోపిక్. ఈ రెండు కూడా దేనికవే డిఫరెంట్ సినిమాలు. కాంతలో కుమారి క్యారెక్టర్ కి ఆంధ్ర కింగ్ లో మహాలక్ష్మి క్యారెక్టర్ కి అసలు పోలికే ఉండదు. దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. రెండు సినిమాలు ప్రేక్షకులని అలరిస్తాయని నమ్ముతున్నాను.