1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 మే 2025 (08:32 IST)

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

Kiran Abbavaram, rahsya Gorak
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. ఆయన భార్య రహస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ సంతోషకరమైన వార్తను తన అభిమానులతో పంచుకున్నారు.
 
తన కొడుకు పుట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, కిరణ్ అబ్బవరం ఒక భావోద్వేగ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో, ఆయన తన బిడ్డ సున్నితమైన పాదాలను సున్నితంగా ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. 
Kiran Abbavaram
Kiran Abbavaram
 
ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. అనేక మంది ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్యల ప్రేమ ప్రయాణం రాజా వారు రాణి గారు చిత్రం సెట్స్‌లో ప్రారంభమైంది. ఆ ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేసిన తర్వాత, ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆపై ఇరు కుటుంబీకుల అంగీకారంతో గత ఏడాది వీరికి వివాహం జరిగింది.