శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (15:18 IST)

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

bhagyashri borse
ఇటీవలి కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంలో నటించిన ఈ అందాల బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు తెరపై మెరిసిన పొడగరి భామలలో ఒకరుగా నిలవడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆ సినిమాలో గ్లామర్ పరంగా ఆమె చేసిన మాయజాలాన్ని ప్రేక్షకులు మరిచిపోలేదు.
 
ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీకి రామ్ సినిమాలో ఛాన్స్ దక్కింది. రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ - ఫీల్ గుడ్ వారు కలిసి ఒక ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళుతున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకి దర్శకత్వం వహించిన మహేశ్ బాబు పి, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కెరియర్ పరంగా రామ్‌కి ఇది 22వ సినిమా.
 
కొంతకాలంగా రామ్‌ను వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆయనను కాపాడలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమాను అంగీకరించాడు. ఈ సినిమా హిట్ రామ్‌తో పాటు భాగ్యశ్రీకి కూడా చాలా అవసరమే. ఈ సినిమాతో హిట్ దొరికితే ఈ సుందరి హవా కొనసాగే అవకాశం ఉంది.