చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు
దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు సోమవారం జరుగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వేడుకల్లో నిమగ్నమైపోయారు. సినిమా సెలెబ్రిటీలు కూడా తమ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ నభా నటేష్ కూడా దీపాల వెలుగుల్లో కనిపిస్తూ కొన్ని అందమైన ఫోటోలోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలను నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇకపోతే నభా నటేష్ సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరెకెక్కుతోన్న ఈ మూవీలో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు.