Samyuktha: హైదరాబాద్ లో అఖండ 2 షూట్, బాలక్రిష్ణ వుంటే అందరికీ ఎనర్జీనే: సంయుక్తమీనన్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న అఖండ-2 తాండవంలో సంయుక్తమీనన్ ఎంట్రీ ఇచ్చింది. త్వరలో షూటింగ్ లో జాయిన్ కానుంది. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, దేవుడి ఆశీస్సులు అందించారు. నటిగా మూడు సినిమాలు చేస్తున్నాను. అఖండ-2 సినిమా సెప్టెంబర్ లో విడుదలకాబోతోంది. ఇందులో నా పోర్షన్ కొంత పార్ట్ చిత్రీకరించాలి. త్వరలో మరోసారి సెట్ లోకి వెళతాను అన్నారు.
బాలక్రిష్ణ గురించి చెబుతూ.. ఆయన షూటింగ్ లో వుంటే అందరికీ ఎనర్జీ వస్తుంది అన్నారు. అదేవిధంగా స్వయంభూ సినిమాలో నటిస్తున్నా అని చెప్పారు. మరో సినిమా కూడా వుంది అన్నారు. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుతో నాల్గవసారి 2021లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా అఖండ 2 - తాండవం రూపొందుతోన్న విషయం తెలిసిందే.
అఖండ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు, మానవాతీత శక్తులు కలిగిన దేవుడిగా కనిపించాడు. ఇదిలా వుండగా ప్రస్తుతం అఖండ్-2 షూటింగ్ హైదరాాబాద్ లో శంకరపల్లిలో కల్కి జరిగిన సెట్ లో జరగుగుతుంది. బాలక్రిష్ణ లేకుండా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. త్వరలో బాలయ్య ఎంట్రీ ఇవ్వనున్నారు.
అఖండ 2 - తాండవం సినిమాటోగ్రఫీ సి రాంప్రసాద్, సంతోష్ డి డెటకే, ఎడిటింగ్ తమ్మిరాజు. రామ్ ఆచంట, గోపి ఆచంట తమ బ్యానర్ 14 రీల్స్ ప్లస్‌పై బిబి 4ని నిర్మిస్తున్నారు. తేజెస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.