సోమవారం, 28 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 19 ఏప్రియల్ 2025 (18:53 IST)

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

Ali at dubai auditorium
Ali at dubai auditorium
భారతదేశంలోని ముఖ్యమైన భాషలన్నింటిలో నటించిన నటుడు అలీ. నటునిగా 1250 సినిమాలు పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా గత పదహారు సంవత్సరాలుగా అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి సాయం చేస్తున్నారు. అలీ నటనను, సేవను దృష్టిలో పెట్టుకుని  కర్ణాటక మీడియా జర్నలిస్ట్‌ యూనియన్‌తో కలిసి గీమా సంస్థవారు అలీకి ఈ లైఫ్‌ టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డును అందించారు. 

Ali at Dubai Future Museum
Ali at Dubai Future Museum
దుబాయ్‌లోని ఫ్యూచర్‌ మ్యూజియంలో ఇటువంటి అవార్డు జరగటం ఇదే తొలిసారి కావటంతో ఎంతో ప్రెస్టీజియస్‌గా ఫీలయ్యరు అలీ. ఈ కార్యక్రమంలో ఎంతోమంది కన్నడ నటీనటులకు, కళాకారులకు , వ్యాపారవేత్తలకు పలు అవార్డులను అందించింది గీమా. తెలుగు నుండి అలీ మాత్రమే అవార్డు అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ– ‘ తెలుగు నుండి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయటం చాలా అనందంగా ఉంది. మాబోటి కళాకారులకు ఇలాంటి అవార్డులే ప్రోత్సాహాన్ని అందించి మరిన్ని మంచి సినిమాలు చేసేలా నాకు చేతనైనా దానిలో నలుగురికి సాయం చేసేలా ముందుకి నడిపిస్తాయి. నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అన్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్‌ అధికార ప్రతినిధులైన అనేకమంది షేక్‌లు పాల్గొన్నారు.