శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (18:26 IST)

సరికొత్త లోకంలోకి తీసుకెళ్లేలా అనసూయ, ప్రభుదేవా వూల్ఫ్ టీజర్

Wolf poster
Wolf poster
ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్ నిర్మాతలుగా, బృందా జయరామ్ సహ నిర్మాతగా వూల్ఫ్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి వినూ వెంకటేష్ దర్శకత్వం వహించారు. ప్రభుదేవా కెరీర్‌లో 60వ సినిమా వూల్ఫ్ రాబోతోంది. తమిళ, తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్లు.
 
వూల్ఫ్ టీజర్‌ను గమనిస్తుంటే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. అనసూయ, ప్రభుదేవాలు సరికొత్త లుక్కులో కనిపించారు. 69 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఇక ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ ఈ సినిమా మీద మరింతగా ఆసక్తిని పెంచేస్తున్నాయి.
 
వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాతలు నటించిన ఈ మూవీకి అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అమ్రిష్ సంగీత దర్శకుడిగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. 
నటీనటులు : ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్, వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాత తదితరులు