మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జులై 2024 (13:05 IST)

పవన్ కల్యాణ్ సార్‌తో స్టెప్పులేశాను.. యాంకర్ అనసూయ

anasuya
యాంకర్ శ్రీముఖి హెస్ట్‌గా వ్యవహరించే ఓ రియాలిటీ షోలో అనసూయ జడ్జీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.."టెలివిజన్ స్క్రీన్‌పై ఎవరికి తెలియని విషయాన్ని చెప్పాలని ఫిక్స్ అయ్యాను. పవన్ కల్యాణ్‌ సార్‌తో నేను ఒక బ్యూటీఫుల్ సాంగ్‌పై స్టెప్పులు వేశాను. ఆ డ్యాన్స్ నంబర్ మాత్రం టెలివిజన్‌ రియాలిటీ షోలో మోత మోగిపోతుంది.." అని అనసూయ వెల్లడించింది. 
 
అనసూయ మాటలు వీడియో రూపంలో వైరల్ అవుతుంది. అయితే ఆమె హరిహర వీరమల్లు సినిమాలో ఓ డ్యాన్స్ నంబర్‌పై పవన్‌తో స్టెప్పులు వేశారనే విషయం ఆమె చెప్పకపోయినా.. బయట ట్రెండింగ్ అవుతుంది.
 
గతంలో అనసూయకు పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు. అత్తారింటికి దారేది సినిమాలో వాస్తవానికి ఆమె పవన్ కల్యాణ్‌తో ఓ పాటలో స్టెప్పులు వేయాల్సి ఉండేది. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా చేయలేకపోయారనే విషయం అప్పట్లో బయటకు వచ్చింది. 
 
అయితే పవన్ కల్యాణ్ పక్కన డ్యాన్స్ చేసే ఆఫర్‌ను రిజెక్ట్ చేశారనే కారణంతో పవర్ స్టార్ అభిమానులు ఆమెను ట్రోల్ కూడా చేశారు. అయితే అసలు విషయం తెలిసిన తర్వాత ఒకే.. అంటూ ఆమెపై కొంత శాంతించారు.