రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)
యాంకర్స్ ఈమధ్య చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆమధ్య తిరుమల లడ్డు గురించి అవసరం లేకపోయినా నటుడు కార్తీని కదిలించి మరీ అడగటంతో ఆయన యధాలాపంగా మాట్లాడి ఇరుక్కున్నారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లో యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ అలాగే ఇరుక్కుంది.
దిల్ రాజు, శిరీష్ లను పొగిడేందుకు ఆమె వాడిని మాటలు కాస్తా వివాదాస్పదమయ్యాయి. అలనాడు రామలక్ష్మణులు ఫిక్షన్ క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు మనముందున్న రామలక్ష్మణులు దిల్ రాజు, శిరీష్ అంటూ ప్రశంసించింది. ఐతే ఇక్కడే ఇరుక్కుంది. రామలక్ష్మణులు ఫిక్షన్ క్యారెక్టర్స్ అనడంతో హిందువులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో శ్రీముఖి తను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తూ తన వ్యాఖ్యల వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయనీ, అందువల్ల క్షమించాలంటూ వీడియో ద్వారా వేడుకుంది.