శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2024 (09:50 IST)

30 ఏళ్లకు తర్వాత భార్యకు విడాకులిచ్చిన ఏఆర్ రెహ్మాన్

AR Rahman
AR Rahman
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పెళ్లయిన సుమారు 30 ఏళ్లకు భార్య సైరా భానుకు విడాకులు ఇచ్చారు. తాము విడిపోతున్నట్లు ఈ జంట ఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించడం గమనార్హం. 
 
ఈ మేరకు పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత వాళ్లు విడిపోవాలన్న ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ల బంధంలో ఎంతో సంఘర్షణ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. 
 
ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా.. వాళ్ల బంధంలో వచ్చిన సమస్యలు, ఉద్రిక్తలు వాళ్ల మధ్య దూరాన్ని పెంచాయి. అందుకే సైరా, రెహమాన్ ఇద్దరూ విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చారని సైరా లాయర్ వందనా షా ఓ ప్రకటన జారీ చేశారు. 
 
29 ఏళ్ల వయసులో రెహమాన్ పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లి సమయానికి అతడు రోజా, బొంబాయిలాంటి పెద్ద పెద్ద హిట్ సినిమాల మ్యూజిక్ అందించాడు. ఆ తర్వాత అతనికి తిరుగు లేకుండా పోయింది. 2009లో ఆస్కార్ గెలిచే వరకూ అతని ప్రస్తానం సాగిపోయింది. దేశమే కాదు ప్రపంచమే మెచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్లలో ఒకడిగా రెహమాన్ ఎదిగాడు. రెహమాన్ కూతురు ఖతీజా 2022లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
 
భార్యతో విడిపోవడంపై రెహమాన్ ఓ ట్వీట్ ద్వారా స్పందించారు. 30 ఏళ్ల సెలబ్రేషన్ వరకు వెళ్తామని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. గుండె ముక్కలైందంటూ రెహ్మాన్ ట్వీట్ చేశారు.