శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2024 (18:24 IST)

బాలీవుడ్ బలుపు - ప్రభాస్‌పై అర్షద్ వార్సీ వివాదాస్పద కామెంట్స్!!

kalki 2898 ad
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌పై బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌‌గా మారాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘క‌ల్కి’ తాను చూశానని మూవీ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పారు. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ అశ్వత్థామతో పోలిస్తే, ప్రభాస్‌ పాత్ర తేలిపోయిందన్నారు. అమితాబ్‌ ఈ వ‌య‌సులో 'క‌ల్కి'లాంటి సినిమాలు ఎలా చేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయ‌న‌లో ఉన్న శక్తిలో కొంచెమైనా ఉంటే లైఫ్ సెట్ అయిపోతుందన్నారు.
 
ఇక ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభాస్‌ లుక్‌ జోకర్‌లా ఉందని, ఎందుకు ఇలా చేశారో తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. అర్షద్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్‌ అభిమానులు అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ వారికి అహం, ఈర్ష్య ఉండటం‌ వల్లే ఫెయిల్‌ అవుతున్నారంటూ సోషల్ మీడియా‌లో మండిపడుతున్నారు. కాగా, ‘కల్కి 2898 ఎడి బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.1100 కోట్లు వసూలు చేసింది. ఆగస్టు 22వ తేదీ నుంచి అమెజాన్‌ ఓటీటీ వేదికగా కల్కీ స్ట్రీమింగ్‌‌కు రానుంది.