శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (14:14 IST)

బాలక్రిష్ణ, నితిన్ మెహతా, బాబీ డియోల్ చిత్రం తాజా అప్ డేట్

Jaipur palce.. balakrishna
Jaipur palce.. balakrishna
నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న తాజా సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్ జైపూర్ మహారాజ ప్యాలెస్ లో షూట్ జరుగుతుంది. తొలుత యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇందులో నటి దివి కూడా నటిస్తోంది. అఖండ సినిమాలో ప్రధాన విలన్ గా నటించిన మిలట్రీ బ్యాక్ గ్రౌండ్ వున్న నితిన్ మెహ్రా ఈ సినిమాలోనూ విలన్ గా నటిస్తున్నాడు. మరో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నాడు. 
 
బాలక్రిష్ణ తో చెప్పే డైలాగ్ లను హిందీలో రాసుకుని తెలుగులో మాట్లాడే సన్నివేశాన్ని నిన్ననే బాబీ డియోల్ పై చిత్రీకరించారు. ప్రధాన కథానాయిక పేరు త్వరలో వెల్లడించనున్నారు. బాలక్రిష్ణ కెరీర్ లో మరో మైలు రాయిలా ఈ సినిమా వుండేలా దర్శకుడు కేర్ తీసుకన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా  బాలక్రిష్ణ కు 109వ సినిమా.  సితార ఎంటర్ టైన్ మెంట్ బేనర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.