శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (16:11 IST)

భరత్ రామ్ ను హీరోగా ఏ రోజైతే చూశానో నిన్ను

Bharat Ram,
Bharat Ram,
చెక్, బుర్రకథ, రంగ రంగ వైభవంగా వంటి సినిమాల్లో  చైల్డ్ హీరోగా నటించిన భరత్ రామ్  హీరోగా ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ నుంచి స్క్రీన్ ప్లే మరియు విజువల్ ఎఫెక్ట్స్ లో సుపరిచితుడు అయిన రాజు బొనగాని దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఏ రోజైతే చూశానో నిన్ను'. గతంలో మహెష్ బాబు, నాగర్జున, రవితేజ, హీరోలుగా ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు రాగా ఇప్పుడు భరత్ రామ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి. అతి త్వరలో హీరోయిన్ ను కూడా ఎంపిక చేసి డిసెంబర్లో షూట్ మొదలుపెడుతున్నట్టుగా  మేకర్స్ తెలిపారు.