శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

సంప్రదాయ దుస్తులు ధరించినా ట్రోల్ చేస్తున్నారు... ఏం చేయాలి? భూమి ఫడ్నేకర్

bhumi padnekar
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పుణ్యమాని సినీ సెలెబ్రిటీలపై నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ ఎక్కువైపోతున్నాయి. దీంతో అనేక మంది సినీ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వైపు రావాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ఒకరు. ఆమెను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 
 
మోడ్రన్ దుస్తులే కాదు.. సంప్రదాయ దుస్తులు ధరించినా ట్రోల్స్ చేస్తున్నారంటూ వాపోయింది. "ఈ రోజుల్లో ట్రోలింగ్‌ సాధారణమై పోయింది. ఏం చేసినా జనాలు ట్రోల్‌ చేస్తారు. పండగ రోజుల్లో నేను సంప్రదాయ దుస్తులు ధరించి ఫొటోలు పంచుకున్నా విమర్శిస్తారు. సినిమా ప్రమోషన్ల సమయాల్లో ఉన్నట్లు కనిపించడం లేదని అంటారు. ఇంతకు ముందు మన దుస్తుల గురించి ఇంట్లో వాళ్లు మాత్రమే మాట్లాడేవారు. ఇప్పుడు వాటి గురించి అందరూ అడుగుతున్నారు. 
 
ఇక నా డ్రెస్సింగ్‌పై చిన్నప్పటి నుంచి నేను విమర్శలు ఎదుర్కొన్నా. 'పొట్టి దుస్తులు ఎందుకు వేసుకుంటున్నావు' అని చాలా మంది ప్రశ్నించేవాళ్లు. అలా ట్రోల్‌ చేసేవాళ్లే మళ్లీ సంస్కృతిని కాపాడాలని మాట్లాడతారు. కానీ, మన గురించి అభిప్రాయాలు పంచుకునేందుకు అసహ్యకరమైన భాషను ఉపయోగిస్తారు. స్త్రీలను గౌరవించడం, మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం మన సంస్కృతిలో ఉంది. కానీ, వాళ్లు మాట్లాడే విధానం చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. వాటిని చదవాలన్నా చాలా ధైర్యం అవసరం. అందుకే ట్రోల్స్‌ను నేను పట్టించుకోను' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.