శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (12:03 IST)

జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. మూడేళ్ల నుంచి శ్రేష్ఠవర్మ వేధిస్తుంది.. Video

sreshti verma
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఆయన సహాయకురాలు శ్రేష్ఠ వర్మ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో జానీ మాస్టర్‌‍పై హైదరాబాద్ నగర పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కేసులో సరికొత్త ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మపై సమీర్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను మూడేళ్ల నుంచి లైంగిక వేధింపులకు గురిచేస్తోందని పోలీసులు తెలిపారు. 
 
చెన్నై నగరంలోని ఓ లాడ్జీకి పిలిపించుకుని నగ్న ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రేష్ఠ వర్మ ఫోన్ చాటింగ్, ఫోటోలను పోలీసులకు సమీర్ సమర్పించాడు. దీంతో శ్రేష్ఠవర్మ ఇపుడు చిక్కుల్లో పడే అవకాశం ఉంది.