శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (17:27 IST)

బాలీవుట్ కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ' కష్టాలు

Kangana Ranaut
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ఎమర్జెన్సీ చిత్రం కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఆమె శ్రమించారు. ఇదే అంశంపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది. సెన్సార్ సర్టిఫికేషన్‌ కోసం ఆదేశించలేమన్న బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 
 
దేశంలో 'ఎమర్జెన్సీ' విధించిన నాటి పరిస్థితులపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగన రనౌత్‌ స్వీయదర్శకత్వంలో రూపొందించిన 'ఎమర్జెన్సీ' చిత్రం. ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను మసకబార్చారని పలు సిక్కు సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. అదేసమయంలో ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ను జారీ చేసేందుకు సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌‌ నిరాకరించింది. 
 
దీంతో కంగనా రనౌత్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది. సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సినిమాపై తలెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సర్టిఫికెట్‌ను జారీ చేయాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీబీఎఫ్‌సీ‌కి ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఇపుడు బాంబే హైకోర్టు పై విధంగా ఆదేశించడం గమనార్హం. 
 
ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమన్న జస్టిస్‌ బీపీ కోలాబవాలా, జస్టిస్‌ ఫిర్దోశ్‌ పూనివాలా డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. 
‘మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీబీఎఫ్‌సీకి మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఆ ఉత్తర్వులను నేరుగా ఉల్లంఘించినట్టు సీబీఎఫ్‌సీకి చెప్పినట్టు అవుతుందని డివిజన్‌ బెంచ్‌ వ్యాఖ్యలు చేసింది. సినిమాపై తలెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్‌ 18 నాటికి సర్టిఫికెట్‌ జారీ  చేయాలని సెన్సార్‌బోర్డును కోరుతూ తదుపరి విచారణను బాంబే హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.