శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (11:06 IST)

త్రిషపై మన్సూర్ అలీఖాన్ వక్రబుద్ధితో కొట్టుమిట్టాడుతున్నాడు : చిరంజీవి

trisha chiranjeevi
ప్రముఖ హీరోయిన్ త్రిషపై విలక్షణ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. త్రిషను ఉద్దేశించి మన్సూర్ చేసిన వ్యాఖ్యలు వక్రబుద్ధితో చేసినట్టుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇదేవిషయంపై ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
త్రిష గురించి మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం సినీ ఆర్టిస్టులకే కాకుండా ఏ మహిళకైనా లేదా ఏ అమ్మాయికైనా అసహ్యంగా ఉంటాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు తీవ్ర పదజాలంతో ఖండించాలని కోరారు. వక్రబుద్ధితో వారు కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. త్రిషతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు బాధితులుగా మారిన ప్రతి మహిళకు తాను అండగా నిలబడతానని చెప్పారు. 
 
కాగా, "లియో" చిత్రంలో తనకు నటించే అవకాశం రాగానే త్రిషతో రేప్ సన్నివేశం ఉంటుందేమోనని భావించానని, కానీ ఆ సినిమాలో అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన్సూర్ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మండిపడగా ఇపుడు చిరంజీవి కూడా తన స్పందనను ట్వీట్ రూపంలో తెలియజేశారు.