సోమవారం, 15 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2025 (10:06 IST)

కానిస్టేబుల్ ట్రైలర్ విశేష స్పందనతో సినిమాపై నమ్మకం వచ్చింది : వరుణ్ సందేశ్

30 lakh views, Varun Sandesh
30 lakh views, Varun Sandesh
హ్యాపీడేస్, కొత్త బంగారులోకం.. చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ  లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం కానిస్టేబుల్ తో మాస్ కమర్షియల్  హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో తప్పకుండా తాను ప్రేక్షకులను మెప్పించగలనని నమ్మకం ఉందని, తన కెరీర్ కు ఈ చిత్రం మరో మలుపు అవుతుందన్న ఆశాభావాన్ని వరుణ్ సందేశ్ వ్యక్తం చేశారు. 
 
 జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్ గా, బలగం జగదీష్ నిర్మిస్తున్నచిత్రం కానిస్టేబుల్. దీనికి  ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, సినిమాట్రైలర్ ను ఆగస్టు 31న రిలీజ్ చేశాం. నాటి నుంచి  ఇప్పటివరకు జనాల్లో విశేష స్పందన వస్తోంది. 30 లక్షల మందికి పైగా ఈ ట్రైలర్ ని ఆదరించారు. మా  అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది.  త్వరలో భారీగా ప్రపంచవ్యాప్తంగా  చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అని అన్నారు.  
 
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, టైలర్ కి అద్భుత స్పందన రావడం ఆనందదాయకం. సినిమా సస్పెన్స్ తో పాటు ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా ఉంటుంది, అలాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది అని అన్నారు.
 
దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ., ట్రైలర్ కి విమర్శకుల మన్ననలు  పొందుతూ దూసుకుపోతుంది, మేము అనుకున్న దానికంటే అత్యధిక స్పందన వస్తుండటంతో టీం అంతా చాలా సంతోషంగా ఉన్నాం..  ఇలాగే మా సినిమాని కూడా [ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాం అని చెప్పారు.
 
ఈ చిత్రంలో  వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు తారాగణం.