శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (14:06 IST)

దీపికాకు అమ్మాయి పుట్టిందోచ్.. రణవీర్ ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ

deepika
బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొణె, ఆమె భర్త  నటుడు రణవీర్ సింగ్ తల్లదండ్రులైనారు. శనివారం, నటి ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో  దీపికా అడ్మిట్ అయ్యింది. 
 
ఆమె ప్రసవానికి ముందు, శుక్రవారం కుటుంబ సభ్యులు ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. దీపిక తన కుటుంబంతో కలిసి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించినప్పుడు, లేత గోధుమరంగు కుర్తా సెట్‌లో ఉన్న రణవీర్ కంటే ముందు నడించింది. ఈ సందర్భంగా ఆమె  గ్రీన్ బెనారాసీ చీరను ధరించింది. శనివారం నుంచి గణేశోత్సవం ప్రారంభం కానుండగా, ఈ శుభదినాన దీపికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
 
దీపికా మరియు రణవీర్ ఫిబ్రవరి 2024లో తన గర్భాన్ని ప్రకటించారు. రణ్‌వీర్ - దీపిక నవంబర్ 2018లో లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'సింగం ఎగైన్'లో దీపికా- రణవీర్ భార్యాభర్తలిద్దరూ కనిపిస్తారు. రణవీర్ సింబాగా అతిధి అవతార్‌లో ఇందులో కనిపించనున్నాడు.