గురువారం, 27 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 27 నవంబరు 2025 (17:27 IST)

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Anchor Sivajyothi
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి అన్నప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తిరుమలలో కాస్ట్లీ ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం, రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ పడ్డాయి. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆమె నేరుగా క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేసారు.
 
ఐనప్పటికీ చాలామంది సంతృప్తి చెందలేదు. ఇదిలావుండగానే తితిదే యాంకర్ శివజ్యోతిపై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. శివజ్యోతి తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునే వీలు లేకుండా ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఐతే ఈ వార్తల్లో వాస్తవం ఎంత వున్నది అన్నది తేలాల్సి వుంది.