శుక్రవారం, 3 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2025 (17:50 IST)

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Rishab Shetty, Diljit Dosanjh and others
Rishab Shetty, Diljit Dosanjh and others
డైరెక్టర్-హీరో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 మ్యూజిక్ ఆల్బమ్ కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ యాక్టర్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని నేడు చిత్ర టీమ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్ షేర్ చేశారు.
 
బిగ్ బ్రదర్ రిషబ్ శెట్టి – మాస్టర్ పీస్ కాంతారను రూపొందించినందుకు సెల్యూట్. ఈ సినిమాతో నాకు వ్యక్తిగత అనుబంధం వుంది. వరాహ రూపం పాట థియేటర్లలో చూసినప్పుడు,  ఆనందంతో ఏడ్చాను. అజనీష్ లోక్‌నాథ్‌కు కృతజ్ఞతలు. ఒక రోజులోనే తన నుంచి చాలా నేర్చుకున్నాను. దిల్జిత్ దోసాంజ్, రిషబ్ శెట్టి పవర్ ఫుల్ కొలాబరేషన్, హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన మోస్ట్ ఎవైటెడ్  కాంతారా చాప్టర్ 1పై అంచనాలు మరింతగా పెంచింది.
 
కాంతారా చాప్టర్ 1 విజువల్‌ విజువల్ వండర్ గా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీని అర్వింద్ ఎస్. కాశ్యప్ అందిస్తుండగా, ఫస్ట్ పార్ట్ లో  ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను  చేసిన బి. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఇస్తున్నారు. హోంబాలే ఫిలిమ్స్‌ విజయ్ కిరగందూర్ నెక్స్ట్ లెవల్ లో నిర్మిస్తున్నారు.
 
కాంతారా చాప్టర్ 1  కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్ లో అక్టోబర్ 2, 2025న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.