గురువారం, 7 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 4 ఆగస్టు 2025 (17:21 IST)

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Dulquer Salmaan, Ravi Nelakudithi, Sudhakar Cherukuri, Natural Star Nani
Dulquer Salmaan, Ravi Nelakudithi, Sudhakar Cherukuri, Natural Star Nani
హీరో దుల్కర్ సల్మాన్ తన 41వ చిత్రం నూతన దర్శకుడు రవి నేలకుదిటితో చేస్తున్నారు. లవ్ స్టొరీ తో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామా గా రూపొందనున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. ఇది నిర్మాణ సంస్థ 10వ వెంచర్. #SLV10 మైల్ స్టోన్ గా నిలుస్తుంది.
 
ఈ రోజు హైదరాబాద్లో ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు షాట్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దర్శకుడు బుచ్చి బాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గుణ్ణం సందీప్, నాని, రమ్య గుణ్ణం స్క్రిప్ట్‌ను టీంకు  అందజేశారు. ఫస్ట్  షాట్‌ను రవి నెలకుడిటి స్వయంగా దర్శకత్వం వహించారు. దసరా, ది ప్యారడైజ్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అవుతుంది.
 
తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషలలో విడుదల కానున్న ఈ సినిమా గురించి త్వరలో మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.