గురువారం, 7 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 6 ఆగస్టు 2025 (15:05 IST)

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

C. Kalyan
C. Kalyan
సిని కార్మికుల సమస్యలకు రేపటికి పూర్తి పరిష్కారం దొరుకుతుందని నిర్మాత, మాజీ ఆల్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడు సి. కళ్యాణ్ తెలిపారు. నిన్న ఫెడరేషన్ నాయకులు, లేబర్ కమీషనర్ కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిసి మంతనాలు జరిపారు. కాగా, నేడు సి. కళ్యాణ్ తో ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు భేటీ అయ్యారు. 
 
ఆయన మాట్లాడుతూ, సినీ ఫెడరేషన్ కార్మికులకు అభద్రతా భావం లేదు. తొందర పడవద్దు. సినీ పెద్దలు ఈ సమస్యకు పరిష్కారం చూపెడతారు. గతంలో దాసరి నారాయణ ఉండి ఇలాంటి సమస్యలను పరిష్కరించేవారు. కనుక రేపటిలోగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను అని తెలిపారు.
 
ఈ సందర్భంగా అగ్ర నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ, ఇక్కడ కార్మికులకు టాలెంట్ లేదు అనడం కరెక్ట్ కాదు. పర భాషా కార్మికులకంటే మనవారే తీసిపోరని, టాలెంట్ అనే మాట ఎలా బయటకు వచ్చిందోకానీ అది కరెక్ట్  కాదని అన్నారు.