శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (17:53 IST)

మిస్టర్ సెలెబ్రిటీ నుంచి నీ జతగా.. సాంగ్‌ను రిలీజ్ చేసిన గోపీచంద్

Mr. Celebrity team with Gopichand
Mr. Celebrity team with Gopichand
పరుచూరి వెంకటేశ్వరరావు మనువడు సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇది వరకు మిస్టర్ సెలెబ్రిటీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.
 
ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ పాటను మాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు. నీ జతగా అంటూ సాగే ఈ మెలోడీ పాటను గణేశా రచించగా.. జావెద్ అలీ ఆలపించారు. వినోద్ యాజమాన్య చక్కటి సోల్ ఫుల్ బాణీని అందించారు. ఇక ఈ పాటను రిలిజ్ చేసిన అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ..  ‘పరుచూరి వెంకటేశ్వరరావు గారి మనవడు హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను చూశాను. చాలా బాగుంది. ఇప్పుడు పాటను రిలీజ్ చేశాను. అది కూడా చాలా బాగుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్. చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 ఇక త్వరలోనే మిస్టర్ సెలెబ్రిటీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.