శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (13:40 IST)

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

HariHara VeeraMallu teaser poster
HariHara VeeraMallu teaser poster
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా హరిహర వీరమల్లు. గత ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ విడతలవారీగా జరుగుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల బిజీలో వున్నారు. అయితే చేసిన షూటింగ్ దాదాపు మూడువంతులు పూర్తయింది. ఇప్పుడు తాజా అప్ డేట్ చిత్ర యూనిట్ ప్రకటించింది.  ధర్మం కోసం యుద్ధం! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  హరిహర వీరమల్లు. టీజర్ మే 2వ తేదీన ఉదయం 9:00 గంటలకు విడుదల కానుంది. అని కొత్త పోస్టర్ విడుదల చేశారు.
 
నిధి అగర్వాల్  హీరోయిన్ గా నటిస్తుండగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు”. ఈ సినిమా పవన్ కెరీర్ లో పెద్ద పవర్ ఫుల్ సినిమాగా వుంటుందని దర్శకుడు గతంలో ప్రకటించారు. ఈ సినిమా విడుదల గురించి కూడా టీజర్ సమయంలో వెల్లడించనున్నారు.
 
ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో హైపర్ ఆది, ఇషు రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఎం ఎం కీరవాణి  సంగీతం సమకూర్చారు.