బుధవారం, 19 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 19 నవంబరు 2025 (12:43 IST)

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

Karthi - Annagaru vastunnaaru
Karthi - Annagaru vastunnaaru
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ వా వాతియార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు "అన్నగారు వస్తారు" టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమాను డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "అన్నగారు వస్తారు" చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
 
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా హీరో కార్తి నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కార్తి కెరీర్ లో "అన్నగారు వస్తారు" మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.
 
నటీనటులు - కార్తి, కృతి శెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, తదితరులు