రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)
సీనియర్ బాలీవుడ్ నటుడు, భాజపా మాజీ ఎంపీ పరేష్ రావల్ ట్విట్టర్లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. షూటింగులో తన మోకాలికి గాయం కావడంతో అది తగ్గేందుకు తన మూత్రాన్ని రోజూ ఉదయం తాగడంతో అది తగ్గిపోయిందంటూ తెలియజేసాడు. ఇపుడు పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే... ఘటక్ అనే చిత్రం షూటింగులో పాల్గొన్న సమయంలో పరేష్ రావల్ గాయాలపాలయ్యాడు. ముఖ్యంగా అతడి మోకాలికి తీవ్ర గాయం అయ్యింది. ఇది తగ్గేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని ముంబైలోని నానావతి ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయట. చికిత్స తీసుకునే సమయంలో నటుడు అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ ఓ సలహా ఇచ్చారట.
అదేంటంటే... ఉదయాన్నే మూత్రం తాగితే మోకాలి నొప్పి తగ్గిపోతుందని చెప్పాడట. దాంతో పరేష్ రావల్ ఆయన సలహాను పాటించాడట. ప్రతిరోజూ తన మూత్రాన్ని తానే తాగేశాడట. మూత్రాన్ని బీర్ అనుకుని తాగేశాడట. విచిత్రంగా అతడికి మోకాలి నొప్పి నెలన్నర రోజుల్లోనే తగ్గిపోయిందట. 3 నెలల పాటు బెడ్ పైన పడుకుని చికిత్స తీసుకోవాల్సిన పరేష్ రావల్ నెలన్నరకే మామూలైపోవడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని పరేష్ రావల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.