బుధవారం, 10 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 9 డిశెంబరు 2025 (16:26 IST)

Fariya: కొత్తగా కంటెంట్ వినగానే నటించాలని అనిపించింది : ఫరియా అబ్దుల్లా

Naresh Agastya, Faria Abdullah and others
Naresh Agastya, Faria Abdullah and others
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు "గుర్రం పాపిరెడ్డి" సినిమా నుంచి 'పైసా డుమ్ డుమ్' సాంగ్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.
 
డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ - డార్క్ కామెడీ జానర్ లోనే కొత్తగా ప్రయత్నించాం. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు మా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం. "గుర్రం పాపిరెడ్డి" సినిమా క్వాలిటీగా వచ్చేందుకు ప్రతి టీమ్ మెంబర్ వర్క్ చేశారు. సినిమా మిమ్మల్ని నిరాశపర్చదు. మా మూవీని ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నాం. డిసెంబర్ అంటే హాలీడేస్ సీజన్. ఇలాంటి సీజన్ లో ఫుల్ ఫన్ ఉండే మా మూవీ చూడటం మరింత ఎంటర్ టైన్ చేస్తుంది. మల్టిపుల్ క్యారెక్టర్స్, లేయర్స్ తో మా సినిమా ప్రేక్షకుల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ట్రైలర్ ను ఈ నెల 11న లేదా 12న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మా మూవీ ఇంత మంచి స్కేల్ లో రావడానికి ప్రొడ్యూసర్స్ ఇచ్చిన సపోర్ట్ కారణం. "గుర్రం పాపిరెడ్డి" సినిమాకు మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. యోగిబాబు, జాన్ విజయ్ లాంటి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి తమిళంలోనూ మా సినిమాను రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. డార్క్ కామెడీ మూవీస్ లో నెగిటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయి. మా కథ పాజిటివ్ గా ఉంటుంది. నేను చూసిన కొందరు వ్యక్తుల ఇన్సిపిరేషన్ తో ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నాను. తెలివైనవారు, తెలివితక్కువ వారి మధ్య జరిగిన వార్ ఈ మూవీ కాన్సెప్ట్. తెలివైనవారు తెలివితక్కువ పనిచేసినా, తెలివితక్కువ వారు తెలివైన పనిచేసినా వారి జీవితాలు ఎలా మారుతాయి అనేది మా మూవీలో ఫన్ తో చూపించాం. అన్నారు.
 
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ - మా సాంగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మా "గుర్రం పాపిరెడ్డి" సినిమా రిలీజ్ కు తక్కువ టైమ్ ఉంది. కంటెంట్ బాగుంటే తక్కువ టీమ్ లోనే ప్రేక్షకులకు సినిమాను రీచ్ చేయొచ్చు అని ఓ అవార్డ్ ఈవెంట్ లో తేజ సజ్జా చెప్పారు. మా సినిమాకు కూడా అలాంటి రీచ్ వస్తుందని కోరుకుంటున్నా. మా టీమ్ అంతా ఒక కొత్త తరహా మూవీ చేసేందుకు ప్రయత్నించాం. బాగా టిపికల్ మూవీగా కాకుండా సినిమా అంతా మంచి ఫన్ ఉండేలా చూసుకున్నాం. నెక్ట్స్ రాబోయో ప్రమోషనల్ కంటెంట్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటామని నమ్ముతున్నాం. ఈ కథ వినగానే నటించాలని అనిపించింది. కామెడీలోనే కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అని ఈ సినిమాలో నటించిన తర్వాత అనిపించింది. హ్యూమర్ ఉన్న మూవీస్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నా. అన్నారు.
 
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ - 'పైసా డుమ్ డుమ్' సాంగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఫరియా అబ్దుల్లా కూడా మా మూవీలో ఒక పాట పాడింది. ఆ పాటను త్వరలో వింటారు. ఈ సినిమాకు ఫస్ట్ ఐడియా రైటర్ పూర్ణ ఇచ్చారు. ఆయన ఐడియా వల్లే మేమంతా ఇక్కడున్నాం. ఈ సినిమాలో నా ఇంటిపేరు గుర్రం. నా పేరు పాపిరెడ్డి. నా కెరీర్ లో ఇదొక కొత్త తరహా క్యారెక్టర్ లా పేరు తీసుకొస్తుంది. ఈ నెల 19న  "గుర్రం పాపిరెడ్డి" థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ సినిమా అయినా ఒక ప్రాపర్ లాజిక్ తో చేయాలి, మన సెన్సిబిలిటీస్ కోల్పోకుండా ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాలి అనేది నా ప్రయత్నం. అలాంటి కమర్షియల్ మూవీస్ చేయాలని అనుకుంటున్నా. ఈ కథలో నేనే హీరో అని అనుకోవడం లేదు. అన్ని పాత్రలకూ ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్నారు.