శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2024 (15:23 IST)

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ పాత్ర చెప్పగానే వద్దకున్నా: శ్రీకాంత్

Srikanth
Srikanth
రామ్ చరణ్ తో గతంలో క్రిష్ణ వంశీ సినిమాలో నటించాడు. చిరంజీవితో నటించడం కూడా  ఆయన నటించారు. కానీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆఫర్ వస్తుందని అనుకోలేదట. ఓసారి శంకర్ నుంచి ఫోన్ వచ్చింది.  అదే గేమ్ ఛేంజర్. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.  అందులో ఓ పాత్ర కోసం నన్ను అడిగారు. దర్శకుడు మొదట కథ చెప్పగానే ఇలాంటి క్యారెక్టర్ చేస్తే  తర్వాత అన్నీ ఇలాంటి పాత్రలే వస్తాయి. పైగా ముసలి పాత్ర కావడంతో వద్దనుకున్నా. అప్పటికి ఫస్ట్ పార్ట్ చెప్పారు. ఆ తర్వాత సెకండ్ ఫార్ట్ లోనూ నా పాత్ర వుందనీ ఆ పాత్ర తీరును చెప్పగానే వెంటనే తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నానని నటుడు శ్రీకాంత్ వెల్లడించారు.
 
అసలు శంకర్ లాంటి దర్శకుడి సినిమాలో అవకాశం రావడమే గొప్ప. ఇందులో ముసలి పాత్ర కోసం చాలా మేకప్ వేయాల్సివచ్చింది. దాన్ని తీయడానికి చాలా టైం పడుతుంది. ఓసారి టైం లేక షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళాను. రాత్రయింది. డోర్ తెరవగానే మా అమ్మగారు వున్నారు. ఆ పాత్ర తీరు మొత్తం చనిపోయిన మా నాన్నగారిలా వుంటుంది.  ఆ గెటప్ నాకు రావడం కూడా నాకు కలిసి వచ్చింది.  అమ్మగారు డోర్ తీయగానే నన్ను చూసి షాక్ కు గురయ్యారు. ‘పాప.. ఏమిటి. అలా చూస్తున్నావ్. నేనే నీ ఇంటిఆయన్ని‘ అంటూ అచ్చు నాన్నగారిలా మాట్లాడడానికి ట్రై చేశా. ఇంకా తను షాక్ లోనే వుండడంతో అమ్మను పట్టుకుని అసలు విషయం చెప్పా.  అంటూ.. తన తండ్రిలాంటి పాత్ర వేసిన శ్రీకాంత్ తెలిపారు. ఈ సినిమా జనవరి 10న విడుదలకాబోతుంది. ఇందులో శ్రీకాంత్ పాత్ర పెద్ద రామ్ చరణ్ కు వెన్నుపోటు పొడిచేవాడిగా వుంటుందా? లేదా? అనేది తెరపై చూడాల్సిందేనట.