గురువారం, 6 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శనివారం, 1 నవంబరు 2025 (16:49 IST)

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

Janhvi Kapoor as Achiyamma
Janhvi Kapoor as Achiyamma
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. నేటితో షూట్ పూర్తవుతుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో రామ్ చరణ్, జాన్వీ పై ఓ సాంగ్ చిత్రీకరించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోంది. నేడు ఈ చిత్రంలోని జాన్వీ పాత్రను రిలీవ్ చేసే పోస్ట్ చేశారు. ఇందులో రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా నటిస్తోంది. లోగడ రంగస్థలం లో సమంత పాత్ర తరహాలో వుంటుందని తెలుస్తోంది.
 
కాగా, చిత్రీకరించిన పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. జాన్వీకి మాస్ పాత్ర అచ్చివస్తుందేమో చూడాలి. స్పోర్ట్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో కబడీ నేపథ్యంగా సాగుతుంది. హైదరాబాద్ లో ఆటపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రూపొందుతోంది.