Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?
జపాన్ ఈశాన్య తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అమోరి, ఇవాటే, హొక్కైడో ప్రిఫెక్చర్లకు సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం బాహుబలి: ది ఎపిక్ ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనల కోసం జపాన్‌లో ఉన్నందున, ప్రభాస్ అభిమానులు అతని భద్రత గురించి ఆందోళన చెందారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులతో సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చాలా మంది అభిమానులు ప్రభాస్ భద్రత కోసం అడుగుతున్నారు.
ఈ మేరకు దర్శకుడు మారుతి అభిమానులకు హామీ ఇచ్చారు. "డార్లింగ్‌తో మాట్లాడారు. అతను టోక్యోలో లేడు.. సురక్షితంగా ఉన్నాడు. చింతించకండి." అంటూ తెలిపారు. కాగా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్, మారుతి కలిసి పనిచేస్తున్నారు.