శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (15:31 IST)

టీజర్‌తోనే బిజినెస్‌ సర్కిల్స్‌ల్లో హాట్‌టాపిక్‌గా మారిన కళింగ

Kalinga ph
Kalinga ph
సినిమాలో వున్న కంటెంట్‌ ఎలా వుండబోతుంది అనేది విడుదలకు ముందే.. ఆ సినిమా టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. అయితే ఒక్క టీజర్‌తోనే ఆ సినిమాకు బజ్‌ వచ్చి బిజినెస్‌ ఎంక్వైరీలు స్టార్‌ అయ్యి.. కొన్ని ఏరియాలు బిజినెస్‌ కూడా క్లోజ్‌ అయిదంటే ఆ సినిమా కంటెంట్‌ ఎంత స్ట్రాంగ్‌గా వుండబోతుందో పత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సరిగ్గా ఈ కోవలోకే వస్తుంది 'కళింగ'  చిత్రం.  
 
కిరోసిన్ హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు మరోసారి  విభిన్నమైన కథతో... వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కళింగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి అప్‌డేట్‌ మంచి అటెన్షన్‌ను డ్రా చేసింది. ఈ చిత్రం నుంచి విడుదలైన 
టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. 
 
ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో ఈ సినిమా బిజినెస్‌ కూడా ఊపందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం ఓవర్‌సీస్‌ హక్కలను,  ఇప్పటి వరకు పలు బిగ్‌ ప్రాజెక్ట్‌ చిత్రాలను పంపిణీ చేసిన పీహెచ్‌ఎఫ్‌ ఎల్‌ఎల్‌సీ సంస్థ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా హిందీ రైట్స్‌ కోసం కూడా పలు సంస్థలు పోటీపడుతున్నాయి. 
 
నిర్మాత మాట్లాడుతూ 'నేటి ట్రెండ్‌కు తగ్గ కథాంశంతో..  ఫిక్షనల్ డ్రామా విత్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో  రూపొందుతున్న సినిమా ఇది. ముఖ్యంగా ఈ చిత్రానికి గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే అనేది బిగ్గెస్ట్‌ ప్లస్‌ అవుతుంది. ఆడియన్స్‌ ని ప్రతి సన్నివేశంలో థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. ముఖ్యంగా టీజర్లో వున్న సంభాషణలు, హీరో ధృవ వాయి నటన, స్క్రీన్ ప్రెజెన్స్.. విజువల్స్, ఆర్ఆర్ ఎంతో బజ్‌ను తీసుకొచ్చాయి. ఇది కేవలం టీజర్‌ మాత్రమే.. ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆడియన్సకు గూజ్‌ బంప్స్‌ తీసుకొస్తాయి. చిత్ర ప్రమోషన్స్‌ను కూడా అగ్రెసివ్‌గా చేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ రాబోతున్నాయి' అన్నారు. 
 
ధృవ వాయు, ప్రగ్యా నయన్ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆడుకాలం నరేష్‌ కీలకపాత్రను చేస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, బలగం సుధాకర్, ప్రార్ధిని, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.