శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (18:22 IST)

కమల్ హసన్ గారు ఎమోషనల్ అయినట్లే ఆడియన్స్ అయ్యారు : రాజ్‌కుమార్ పెరియసామి

Rajkumar Periyasamy
Rajkumar Periyasamy
శివకార్తికేయన్, సాయి పల్లవి నేషన్ ప్రైడ్ బ్లాక్ బస్టర్ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు.  అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి సినిమా విశేషాలని పంచుకున్నారు.  
 
'అమరన్' తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.. కంగ్రాట్యులేషన్స్
-థాంక్యూ. అమరన్ కి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. సినిమాని ఇంతగొప్పగా ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కి థాంక్ యూ సో మచ్. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. 'అమరన్'తో అది మరోసారి ప్రూవ్ అయ్యింది.        
 
కమల్ హసన్ గారు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి సపోర్ట్ చేశారు?
-కమల్ హసన్ గారు వండర్ ఫుల్ పర్శన్. ఈ సినిమాకి బిగినింగ్ నుంచి చివరి వరకూ చాలా సపోర్ట్ ఇచ్చారు. నాపై ఎంతో నమ్మకం ఉంచారు. పూర్తి స్వేఛ్చ ఇచ్చారు.
 
-ఈ సినిమా విడుదలకు ముందు కమల్ హసన్ గారి చూపించాను. చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా చోట్ల ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఫిమేల్ పర్స్పెక్టివ్ నుంచి ఈ కథని డ్రైవ్ చేయడం ఆయనకు చాలా నచ్చింది. 'ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్ ని చాలా అద్భుతంగా తీసావ్' అని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోను.
 
శివకార్తికేయన్, సాయి పల్లవి క్యారెక్టర్స్ గురించి?
-ఈ కథ రాస్తున్నప్పుడే ఇందు క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. రియల్ ఇందు మేడంని కలిసిన తర్వాత ఆ క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితేనే పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్, ఎమోషన్ హై వున్న క్యారెక్టర్ అది.
 
-ఈ కథ రాస్తున్నప్పుడు హీరో ఎవరనేది నా మైండ్ లో లేదు. ఈ కథని శివ కార్తికేయన్ గారికి చెప్పాను. ఆయనకి ఈ కథ చాలా నచ్చింది. చాలా కనెక్ట్ అయ్యారు. ఇంతకుముందు ఆయన ఇలాంటి సినిమాలు చేయలేదు. అమరన్ లాంటి ఫుల్ ప్లెడ్జ్ యాక్షన్ రోల్ చేయలేదు. అందుకే సినిమా చాలా ఫ్రెష్ గా కనిపించింది. ఆయన ఈ కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్టు చేసేస్తానని చెప్పారు. తర్వాత కమల్ సార్ ని కలిసాం. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.
 
ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన అంశాలు ఏంటి?
- ఇది రియల్ కథ. ఈ కథకు ప్రారంభం, ముగింపు తెలుసు. అలాంటి కథని ఆడియన్స్ కి ఎంగేజింగ్ చెప్పడం, రియాల్టీని, ఫిక్షన్ ని  బ్యాలెన్స్ చేయడం, ఒరిజినల్ ఇన్సిడెంట్ ని రీ క్రియేట్ చేయడం ఇవన్నీ ఛాలెంజెస్ అనుకోను గాని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. నాకు రియలిజం ఉన్న సినిమాలు ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.
 
-యాక్షన్స్ సీక్వెన్స్లు చేయడం, అలాగే కాశ్మీర్లో తీసిన సీక్వెన్సులు ఇవన్నీ ఛాలెంజ్ తో కూడినవి. నేను ప్రతి యాక్షన్ పార్ట్ ని క్లియర్ గా రాసుకున్నాను. ప్రతి షాట్ ని పేపర్ మీద ప్లాన్ చేసుకున్నాను. అవన్నీ స్క్రీన్ మీదకు అచీవ్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్.
 
జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి?
-జీవి ప్రకాష్ ఈ సినిమాకి పిల్లర్ స్ట్రెంత్. చాలా కొత్త మ్యూజిక్ ఇచ్చారు. సోల్ ఫుల్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేశారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేయడం నిజంగా అదృష్టం.
 
నిర్మాతల గురించి ?
-కమల్ హాసన్ గారు, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తోనే సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చింది. అలాగే ఈ సందర్భంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ ఫ్యామిలీకి థాంక్స్ చెబుతున్నాను.  
 
ఇందు రెబకావర్గీస్ గారు సినిమా చూసిన తర్వాత ఎలా ఫీలయ్యారు ?
-ఇందు గారికి ఈ సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూశారు. సినిమా చివరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యారు.
 
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ?
-ప్రస్తుతం చర్చల్లో జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతాను.