శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (12:34 IST)

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

kantara
కన్నడ స్టార్ దర్శకుడు రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార ఛాప్టర్-1 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 
 
తాజాగా ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని కొల్లూరు సమీపంలో జడ్కల్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ముగించుకొని 20 మంది జూనియర్ ఆర్టిస్టులతో వస్తోన్న మినీ బస్సు బోల్తా పడింది. 
 
ముదూరులో షూటింగ్ కంప్లీట్ చేసుకొని కొల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఇందులో దాదాపు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్పల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.