శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (19:40 IST)

"కేరింత" హీరోకు సింపుల్‌గా పెళ్లైపోయింది.. వధువు ఎవరంటే?

Viswant Duddumpudi
Viswant Duddumpudi
తెలుగు యంగ్ హీరో విశ్వంత్ నిరాడంబరంగా వివాహం చేసుకున్నాడు. కేరింత సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్.. మనమంతా, జెర్సీ, ఓ పిట్ట కథ, కథ వెనక కథ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 
 
ప్రస్తుతం విశ్వంత్ భావన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. విశ్వంత్ ఈ ఫోటోలను షేర్ చేసాడు. ఈ సంవత్సరం ఆగస్టులో విశ్వంత్, భావన నిశ్చితార్థం జరగగా, ఎలాంటి హడావిడి లేకుండా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 
 
ప్రస్తుతం విశ్వంత్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే విశ్వంత్ ఈ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా కింద "ఏ ప్రామిస్ ఆఫ్ లైఫ్ టైం" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. 
 
విశ్వంత్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలలో కూడా ఆయన నటిస్తున్నారట.