సోమవారం, 8 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2025 (13:00 IST)

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram,  Sri Gowri Priya Kiran
Kiran Abbavaram, Sri Gowri Priya Kiran
హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా "కె ర్యాంప్"తో సక్సెస్ అందుకుని ఉత్సాహంలో ఉన్నాడు. ఆ సక్సెస్ ను తన కొత్త సినిమా "చెన్నై లవ్ స్టోరీ" కంటిన్యూ చేస్తుందనే కాన్ఫిడెన్స్ ఆయనలో కనిపిస్తోంది. సరికొత్త ప్రేమ కథగా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా మేజర్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మూవీ ఔట్ పుట్ మ్యాజికల్ గా వచ్చిందంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. "చెన్నై లవ్ స్టోరీ" సక్సెస్ పై ఈ యంగ్ హీరో పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.
 
"చెన్నై లవ్ స్టోరీ" సినిమాను అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియ కిరణ్ అబ్బవరంకు పెయిర్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి మెలొడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.