గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 నవంబరు 2024 (14:48 IST)

రెండు రోజుల్లోనే కలెక్షన్స్ షేక్ చేస్తున్న కిరణ్ అబ్బవరం క మూవీ

KA collections
KA collections
హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రేక్షకుల నుంచి "క" సినిమా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి.  క సినిమా 2 రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 3వ రోజు బుకింగ్స్ ఉధృతి కొనసాగుతోంది. ఈ ట్రెండ్ చూస్తుంటే "క" ఫస్ట్ వీక్ హ్యూజ్ కలెక్షన్స్ సాధించనున్నట్లు తెలుస్తోంది.  ఇక తమిళ వర్షన్ కూడా హిట్ అనే నెలకొంది. ఈ సినిమా థియేటర్లు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
 
ఓ సరికొత్త థ్రిల్లర్ మూవీని చూశామనే ప్రశంసలు "క" సినిమాకు దక్కుతున్నాయి. కిరణ్ అబ్బవరం పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతోంది. రాధగా తన్వీరామ్, సత్యభామగా నయన్ సారిక అప్రిషియేషన్స్ అందుకుంటున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే ట్విస్టులతో దర్శకులు సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించి తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. "క" సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
 
నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు