శుక్రవారం, 28 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2025 (15:33 IST)

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

Love Days team with Samudra
Love Days team with Samudra
నవీన్, కుసుమ చందక జంటగా ఆన్ క్యాన్ ఎంటర్టైన్మెంట్స్, క్రిసెంట్ సినిమాస్ బ్యానర్ల మీద మాదల వెంకటకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ డేస్’. ఏ టాక్సిక్ లవ్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, గీతాంజలి, ‘తొలి ప్రేమ’, ‘అందాల రాక్షసి’ లాంటి అద్భుతమైన ప్రేమ కథల్లా ఈ ‘లవ్ డేస్’ నిలిచిపోతుంది. ‘లవ్ డేస్’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఈ మూవీ జీవితంలో ఎన్నో మెమోరీస్‌ను అందించాలని కోరుకుంటున్నాను. మనస్పూర్తిగా ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ .. ‘నిర్మాత వెంకట్ గారి వల్లే ఈ కథ, ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. సర్ నన్ను హీరోగా ఎందుకు చేయాలని అనుకున్నారో నాకైతే తెలియడం లేదు (నవ్వుతూ). డిసెంబర్ నుంచి మా నిర్మాత కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించబోతోన్నారు. ఆర్య సాయి కృష్ణ ‘రాచరికం’ నుంచి నాతో జర్నీ చేస్తున్నారు. ఎడిటర్ ప్రదీప్ ఎప్పుడూ కష్టపడుతూనే పని చేశాడు. వెంగి సార్ మ్యూజిక్ ఎప్పుడూ అద్బుతంగానే ఉంటుంది. రాం ప్రసాద్ గారి డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. నవీన్ కటౌట్ బాగుంటుంది. కుసుమకి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఆదిత్యకి తెలుగు అంతగా రాకపోయినా కష్టపడి డైలాగ్స్ చెప్పాడు. ఈ మూవీలో ప్రతీ ఒక్కరి పాత్ర బాగుంటుంది.
 
నిర్మాత మాదల వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘సురేష్ లంకలపల్లి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రయాణంలో అతని డెడికేషన్ నాకు చాలా నచ్చింది. ఆయనతోనే మళ్లీ నెక్ట్స్ సినిమా కూడా చేయబోతోన్నాం. భవిష్యత్తులో కూడా ఆయనతో సినిమాలు చేస్తాను. నేను చేయనున్న నాలుగో సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారు. నవీన్, కుసుమ, ఆదిత్య ఇలా అందరూ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. మా మూవీ టైటిల్, గ్లింప్స్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. త్వరలోనే మేం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం’ అని అన్నారు.
 
సహ నిర్మాత రియాజ్ మాట్లాడుతూ .. ‘మేం సురేష్ గారితో రెండో సినిమాను చేస్తున్నాం. మా క్రిసెంట్ బ్యానర్ ఇందులో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉంది. ఇందులో మంచి తారాగణం ఉంది. నా భార్య నస్రీన్‌లో, నాలో కూడా నటుడు ఉన్నాడని సురేష్ గుర్తించారు. ఈ మూవీలో మంచి పాత్రలను పోషించాం. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం’ అని అన్నారు.
 
హీరో నవీన్ మాట్లాడుతూ .. ‘హీరోగా ఇది నాకు తొలి చిత్రం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మాకు మీడియా నుంచి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నాను. మా గ్లింప్స్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. త్వరలోనే మేం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.
 
హీరోయిన్ కుసుమ మాట్లాడుతూ .. ‘‘లవ్ డేస్’ నాకు తొలి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్. నేను హీరోయిన్ అవ్వాలన్నది మా అమ్మ కోరిక. నేడు మా అమ్మ కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. మా మూవీని మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
నటుడు సూరజ్ ఆదిత్య సింగ్ మాట్లాడుతూ .. ‘‘సముద్ర గారే నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నాకు తెలుగు అంతగా రాదు. నా మీద నమ్మకంతో నన్ను సెలెక్ట్ చేసిన సురేష్ గారికి థాంక్స్. నవీన్, కుసుమ అద్భుతమైన నటించారు. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం. అందరూ మా మూవీని చూసి ఆదరించండి’ అని అన్నారు.